బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి ఘోర పరాభవం

బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి ఘోర పరాభవం

బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి ఘోర పరాభవంవరంగల్ టైమ్స్, మెదక్ జిల్లా: గత మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారిన ఇద్దరు కౌన్సిలర్లను ప్రజలు తిరస్కరించారు. తూప్రాన్ మాజీ చైర్మన్ (మామిండ్ల కృష్ణా జ్యోతి), మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ (నందాల శ్రీనివాస్) లను తాజా మున్సిపల్ ఎన్నికల్లో తూప్రాన్ ప్రజలు ఓడించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెల రాములు చేతిలో నందాల రాధిక శ్రీనివాస్ (కాంగ్రెస్) 311 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెల ప్రియాంక (రఘుపతి) చేతిలో మామిండ్ల కృష్ణా జ్యోతి (కాంగ్రెస్) 64 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.