మార్చిలో పరిషత్ ఎన్నికలువరంగల్ టైమ్స్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే.. అదే ఊపులో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. అందుకే పరిషత్ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి తొలివారంలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగనున్నట్లు సమాచారం.