భారత రక్షణ రంగంలో ‘బాహుబలి డీల్’
₹3.25 లక్షల కోట్లతో 114 రఫెల్ విమానాల కొనుగోలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో ₹3.25 లక్షల కోట్ల విలువైన భారీ రక్షణ ఒప్పందానికి భారత్ సిద్ధమైంది. మొత్తం 114 రఫెల్ జెట్లను కొనుగోలు చేయనున్నారు. వీటిలో 26 విమానాలు నౌకాదళం (Navy)కోసం కేటాయించబడతాయి.
మేక్ ఇన్ ఇండియా–హైదరాబాద్ వేదికగా: ఈ ఒప్పందం కింద 80% విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తారు. ముఖ్యంగా వీటి విడిభాగాలను హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ యూనిట్‌లో తయారు చేయడం మన నగరానికి గర్వకారణం. అన్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ రఫెల్ విమానాలు 2030 నుండి డెలివరీ కానున్నాయి. ఇది సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరికగా మారనుంది.












