ఎంపీ అర్వింద్ పై కేసు నమోదు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అర్వింద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిపై దురుసుగా వ్యవహరించారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది. బుధవారం NZBలోని 287వ పోలింగ్ బూత్ నుంచి తమ అభ్యర్థిని బయటకు పంపిన విషయంలో ‘యూజ్ లెస్ ఫెలోస్, బలిసిందా..’ అంటూ పరుష పదజాలంతో ఓ పోలీసును దూషించారు. ఈ వీడియో వైరలవ్వగా ఎలక్షన్ స్టాఫ్ ఫిర్యాదుతో ఎంపీపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు.














