వాటిపై ఇంకా కసి తీరలేదన్న బాలయ్య

వాటిపై ఇంకా కసి తీరలేదన్న బాలయ్య

ఒంగోలులో ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ రోజు నుంచే సంక్రాంతి పండుగ మొదలైందన్న బాలయ్య
ఎన్ని సినిమాలు చేసినా ఇంకా కసి తీరలేదన్న బాలయ్య
స్పెషల్ గెస్టుగా అర్హత బి. గోపాల్ కే ఉందంటూ ప్రశంసలు
శ్రుతి హాసన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అంటూ కితాబు
హానీ రోజ్ పాత్ర గురించి చెప్పనన్న బాలయ్యవాటిపై ఇంకా కసి తీరలేదన్న బాలయ్యవరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘వీరసింహారెడ్డి’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడారు. “ఈ రోజు నుంచే సంక్రాంతి పండుగ మొదలైంది. అందువలన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని బాలయ్య అన్నారు. ఈ ఫంక్షన్ కి ఎవరిని పిలుద్దామని అడిగారు. ఈ వేదికను శాసించే హక్కు ఎవరికీ లేదు. నాకు ఎన్నో హిట్లు ఇచ్చిన బి. గోపాల్ కి మాత్రమే ఉందని చెప్పి ఆయనను ఆహ్వానించానన్నారు.

నటీనటుల టాలెంటును వెలికితీసే సత్తా ఉన్న ఒంగోలు గిత్త గోపీచంద్ మలినేని. నిజంగానే ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ‘భైరవద్వీపం. ‘ఆదిత్య 369’, ‘అఖండ’ సినిమాల మాదిరిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా కసి తీరలేదు. విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాను. ఎప్పటికప్పుడు ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండాలనేది నాన్నగారి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఇక శ్రుతి హాసన్ లక్కీ హీరోయిన్ అనడం కంటే సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనడం కరెక్ట్. ఎందుకంటే తను చాలా కష్టపడి పైకొచ్చింది.

తను మంచి డ్యాన్సర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హనీ రోజ్ కి తెలుగులో ఇదే ఫస్టు మూవీ. తనని చూడగానే భలే అమ్మాయిని పట్టారే అనిపించింది. తన పాత్రను గురించి నేను చెప్పను .. సినిమా చూసిన తరువాత మీరే చెప్పుకుంటారు అంటూ ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు”. ఈ వేదికపై శ్రుతి హాసన్ కూడా స్టెప్పులు వేయడం కొసమెరుపు.