నిమ్మకూరులో బాలయ్య సందడి
warangaltimes, కృష్ణాజిల్లా : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా నిమ్మకూరులో కొద్దిసేపు సందడి చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో దొరికిన కొద్దిపాటి విరామంతో స్వగ్రామం వచ్చారు. కారు దిగి బంధువుల ఇంటికి వెళుతున్న బాలయ్యకు సమీపంలోని మహిళా కళాశాల విద్యార్థినిలు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. సంతోషించిన బాలయ్య బాగా చదువుకోవాలని విద్యార్థినులను ఆశీర్వదించారు. సమీప బంధువులతో కొద్దిసేపు ముచ్చటించిన బాలకృష్ణ తర్వాత వెను తిరిగారు.