బల్దియాపై ఎగిరేది గులాబీ జెండానే: మంత్రి జగదీష్ రెడ్డి

బల్దియాపై ఎగిరేది గులాబీ జెండానే: మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : బల్దియాపై ఎగిరెది ముమ్మాటికీ గులాబీ జెండా యే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్ది స్పష్టం చేశారు. వందకు పైగా డివిజన్ లలో టి ఆర్ యస్ సునాయాసంగా గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జి హెచ్ యంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోజున ఆయన ఎల్ బి నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో అపార్ట్మెంట్ వసూలు కాలనీ సంక్షేమ సంఘాల తో వ్యక్తిగత సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో జరుగుతున్న అభివృద్ధి ని ప్రగతి నివేదిక రూపంలో టి ఆర్ యస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ విడుదల చేసిన అంశాలను ఆయన ఆయా సమావేశలలో ముఖ్యులకు వివరించారు.అనంతరం ఈ సాయంత్రం ఎవనస్థలిపురం లోని జిట్టా రాజశేఖర్ రెడ్డి నివాసగృహంలో పార్టీ ముఖ్యుల తో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చెయ్యడానికి అనుసరించాల్సిన వ్యూహం పై మంత్రి జగదీష్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.