సుంకాల వసూళ్లు ఫిబ్రవరి 24 నుంచి నిలిపివేత

ట్రంప్‌ సుంకాల వసూళ్లు ఫిబ్రవరి 24 నుంచి నిలిపివేత

సుంకాల వసూళ్లు ఫిబ్రవరి 24 నుంచి నిలిపివేతవరంగల్ టైమ్స్, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump)విధించిన సుంకాలపై Supreme Court of the United States కీలక తీర్పు ఇచ్చింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన నేపథ్యంలో, ఫిబ్రవరి 24 నుంచి వాటి వసూళ్లు నిలిపివేస్తున్నట్లు U.S. Customs and Border Protection ప్రకటించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో దిగుమతి–ఎగుమతి రంగాలకు తాత్కాలిక ఊరట లభించనుంది. వ్యాపార వర్గాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నాయి.అయితే సుంకాల వ్యవహారంపై తదుపరి చర్యలు ఏవీ తీసుకుంటారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.