జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగిందిహైదరాబాద్: బల్దియాలో ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేవిధంగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. డిసెంబర్‌ ఒకటిన పోలింగ్‌, నాలుగున కౌంటింగ్‌తో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో నగరంలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. గత కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎన్నికల ప్రకటన రావటంతో రాజకీయపార్టీల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ప్రధాన పార్టీలు అస్త్ర,శస్ర్తాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.