మూడు జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే

మూడు జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే…నివ‌ర్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌

మూడు జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వేఅమ‌రావ‌తి‌: నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి శ‌నివారం ఉద‌యం పర్యటించారు. ఉద‌యం గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం జ‌గ‌న్ ప‌రిశీలించారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించి అనంత‌రం పంట, ఆస్తి న‌ష్టం వివరాలను సీఎం జ‌గ‌న్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులు, ఉన్న‌తాధికారులు, వైయస్సార్‌ కడప, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష.సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయంలో వైయస్సార్‌ కడప, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ల‌తో సమీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎంలు కె.నారాయణస్వామి, అంజాద్‌ భాషా, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌ కుమార్ యాద‌వ్‌, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.