కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ డా.కడియం కావ్య

కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ డా.కడియం కావ్య

-పీడీఎస్ బియ్యం నాణ్యతపై కేంద్రాన్ని ప్రశ్నించిన కావ్య

కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ డా.కడియం కావ్యవరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యతపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా పీడీఎస్ బియ్యం నాణ్యతపై ఫిర్యాదుల పరిస్థితి ఏమిటి? కేంద్ర సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నిర్వహించిన తనిఖీల వివరాలేమిటి? నాణ్యతలో లోపాలు తలెత్తితే తీసుకున్న చర్యలేమిటి? సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, పారదర్శకత కోసం చేపట్టిన చర్యలేమిటి? అంటూ కేంద్రం ప్రబుత్వన్ని ఎంపీ డాక్టర్ కడియం కావ్య సమగ్రంగా వివరణ కోరారు.ఈ ప్రశ్నకు స్పందించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి తెలంగాణలో పీడీఎస్ బియ్యం నాణ్యతపై గత మూడేళ్లు, ప్రస్తుత సంవత్సరంలో ఒక్క ఫిర్యాదూ అందలేదని లోక్‌సభలో స్పష్టం చేశారు.

తెలంగాణ డీసీపీ రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నాణ్యత తనిఖీలు నిర్వహించి ధాన్యాలను కొనుగోలు చేసి, నిల్వ చేసి, కేంద్ర ప్రమాణాల ప్రకారం పీడీఎస్ ద్వారా పంపిణీ చేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. ఎఫ్‌సీఐ–రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త బృందాలు నిల్వ కేంద్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2022–23లో 542,2023–24లో 380,2024–25లో 482,2025–26లో (జనవరి వరకు) 268 తనిఖీలు జరిగాయని తెలిపారు. ఏ దశలోనూ మానవ వినియోగానికి అనర్హమైన ధాన్యం గుర్తించలేదన్నారు.పీడీఎస్ వ్యవస్థలో నాణ్యత, పారదర్శకత పెంచేందుకు విజిలెన్స్ కమిటీలు, ఈ–పాస్ యంత్రాలు, ఆధార్ ఆధారిత పంపిణీ, ఆన్‌లైన్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, ‘మేరా రేషన్’యాప్ అమల్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. .వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లేవనెత్తిన ప్రశ్నతో పీడీఎస్ వ్యవస్థపై పార్లమెంట్ దృష్టి కేంద్రీకృతమైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.