బిపిన్ రావత్ భార్య మధులిక మృతి

బిపిన్ రావత్ భార్య మధులిక మృతి

చెన్నై : తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణించగా , 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఒకరు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని సమాచారం.

హెలికాప్టర్ ప్రమాద ఘటనా స్థలంలో మృతదేహాలు ముద్దలుముద్దలుగా మారిపోయాయి. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు మాడిమసైపోయాయి. డీఎన్ ఏ టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను కూనూరు ఎయిర్ బేస్ లోని వెల్లింగ్ టన్ ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో రావత్ కు ముగ్గురు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.