బతికే ఉన్న బిపిన్ రావత్

బతికే ఉన్న బిపిన్ రావత్చెన్నై : ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ బతికే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన తమిళనాడులోని వెల్లింగ్టన్ లో గల మిలిటరీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నేడు మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల సమయంలో బిపిన్ రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వృక్షాన్ని ఢీకొట్టి కూలిపోయింది.

ఈ ఘటనలో హెలికాప్టర్ మంటల్లో కాలి బూడిడైపోయింది. దీంతో హెలికాప్టర్ లోని 11 మంది సజీవ దహనం అయిపోయారు. కేవలం ముగ్గురుని మాత్రమే రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి. అయితే రావత్ తో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో రావత్ కుటుంబసభ్యులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.