సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జూలై 30న సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చేరిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డాక్టర్ డీఎస్ రాణా మాట్లాడుతూ.. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని .. ఆమె ఎలాంటి అనారోగ్యంతో కూడా ఆస్పత్రిలో చేరలేదని అన్నారు. కేవలం సాధారణ పరీక్షలు కోసం ఆస్పత్రిలో చేరారని అన్నారు. కాగా.. ఫిబ్రవరిలో ఆమెకు పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

దే.