తెలంగాణలో కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్‌లు

హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ కరోనా వల్ల మరో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,035కు చేరింది. తెలంగాణలో కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్‌లుప్రస్తుతం రాష్ట్రంలో 2,032 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 2,278 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 133 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌(6), రంగారెడ్డి(6), సంగారెడ్డి(4), నిజామాబాద్‌(3), మహబూబ్‌నగర్‌(2), కరీంనగర్‌(2), ములుగు(2)తో పాటు సిద్ధిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.