రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతివరంగల్‌ : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడటంతో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. హన్మకొండ నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. మృతులను హన్మకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన గజ్జల సంజీవ్‌, రూపేష్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఎంజీఎం దవాఖాన వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.