ఖైరతాబాద్ ఆర్టియే ఆఫీస్ లో హీరో ప్రభాస్

ఖైరతాబాద్ ఆర్టియే ఆఫీస్ లో హీరో ప్రభాస్హైదరాబాద్‌: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం స్టార్ హీరో ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మాస్క్‌ ధరించిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫొటోలకు పోజిచ్చారు.