షూటింగ్ జరుపుకుంటున్న “హనీ ట్రాప్”

షూటింగ్ జరుపుకుంటున్న "హనీ ట్రాప్"

విశాఖ: భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామన రావు నిర్మిస్తున్న చిత్రం “హనీ ట్రాప్”. ఈ చిత్రం షూటింగ్ విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధిచిన కీలక సన్నివేశాలతో పాటు, రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నారు.

చిత్ర నిర్మాత వి వి వామన రావు’ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను అని తెలిపారు. హీరో ఋషి , హీరోయిన్ శిల్ప మరియు తేజులపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరికరించాం. శివ కార్తీక్ యువ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఆ సన్నివేశాల్ని చాల చక్కగా చిత్రీకరించాం అన్నారు. ఈ నెలాఖరుకు విశాఖ షెడ్యూల్ పూర్తి చేస్తాం.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా కథని సమకూర్చాను.. దానికి తగ్గట్లుగా సునీల్ కుమార్ రెడ్డి గారు కథ డిమాండ్ మేరకు అద్భుతమైన లొకేషన్స్ లో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోందని చిత్ర నిర్మాత తెలిపారు.

‘ఇది ఒక సోషల్ థ్రిల్లర్ మూవీ. యూత్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలని ఈ చిత్రం ప్రతిఫలిస్తుంది. భీమిలి, అరకు లాంటి అందమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎస్ వి శివరాంగారి కెమెరా పనితనం, ప్రవీణ్ ఇమ్మడి మ్యూజిక్ చిత్రానికి ఎస్సెట్ అవుతుంది. నటీనటులు అందరూ మంచి సహకారం అందిస్తున్నారు. వామనరావు గారు కథకుడిగా, నటుడిగా మంచి పేరు గుర్తింపు పొందుతారు . డిసెంబర్ నుండి హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూలుతో షూటింగ్ పూర్తి అవుతుందని. “హనీ ట్రాప్” చిత్రాన్ని జనవరి కల్లా రెడీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్. వి వి వామనరావు, ఎఫ్ ఎం బాబాయ్, వాసు, రామన్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కూర్పు- నరేష్ కుమార్ మడికి, కెమెరా: ఎస్ వి శివరాం, కధ-స్క్రీన్ ప్లే-నిర్మాత వి.వి.వామనరావు. సంభాషణలు- దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.