“కుంభమేళా బ్యూటీ ” మోనాలిసా కీలక నిర్ణయం

“కుంభమేళా బ్యూటీ ” మోనాలిసా కీలక నిర్ణయం

"కుంభమేళా బ్యూటీ " మోనాలిసా కీలక నిర్ణయం

వరంగల్ టైమ్స్, ముంబై: మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన “కుంభమేళా బ్యూటీ ” మోనాలిసా ఇప్పుడు తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యునరేషన్ తో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాదారణ జీవితం నుంచి సినీ రంగం వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారింది. ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళా సమయంలో మోనాలిసా దండలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు అనూహ్యంగా సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి వరుస సినిమాలతో బిజీగా మారింది