అధ్యక్ష పదవి నుంచి ఫారూఖ్ తొలగింపు

అధ్యక్ష పదవి నుంచి ఫారూఖ్ తొలగింపుఆదిలాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎంఐఎం పార్టీ నేత జరిపిన కాల్పుల ఘటనపై పార్టీ అధిష్టానం సీరియస్​ అయింది. కాల్పులకు పాల్పడిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్​ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ చీఫ్​ అసదుద్దీన్ ఓవైసీ తొలగించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధంగా వ్యవహరించే ఎంతటి వారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్​ జిల్లాకు త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు ప్రకటించారు.