రైతుల కోసం పోస్టు కార్డు ఉద్యమం

ములుగు జిల్లా: తెలంగాణలో భూ రికార్డుల సవరణ పూర్తయ్యి నేటికీ రెండున్నరేళ్లు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి , ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పాస్‌పుస్తకాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం పోస్టు కార్డు ఉద్యమంములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యములో చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ఆమె ప్రారంభించారు. పాస్ పుస్తకాలు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నేటి నుంచి కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పెండింగ్ పట్టాదారు పాసు పుస్తకాల కోసం చాలాసార్లు ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం స్పందనలేదని ఆరోపించారు. బాధిత రైతులకు వెంటనే పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని పండించిన పంట కు గిట్టు బాటు దర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానో తు రవి చందర్, ఎంపీటీసీ మావుర పూ తిరుపతి రెడ్డి, అంకూస్,శంకర్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.