తెలంగాణ గ్రామాల్లో నాణ్యమైన పరిపాలన
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పిపిపి ఇచ్చిన ఆడిట్ శాఖ డైరెక్టర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గ్రామ పంచాయతీల అడ్మినిస్ట్రేషన్ లో ట్రాన్సపరెన్సీ, అకౌంటబులిటీ అంశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ‘ఆజాదికి అమృత్ మహోత్సవ్’ లో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈనెల 11నుంచి 17వరకు సదస్సులు నిర్వహిస్తున్నది. అందులో సుపరిపాలన అంశంపై బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిపి) ఇచ్చారు. ఈ పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ఆడిట్ శాఖ పనితీరును, గ్రామ స్థాయి నుంచి నాణ్యమైన, సమర్ధవంతమైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ అలోక్ ప్రేమ్ నగర్, అడిషనల్ సెక్రెటరీ చంద్రశేఖర్ కుమార్, తెలంగాణ ఆడిట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.