అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ రజినీకాంత్

అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ రజినీకాంత్

చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దింతో అభిమానులు కంగారు పడుతున్నారు. అప్పుడప్పుడూ ఈయన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. ఆ మధ్య విదేశాలకు కూడా వెళ్లొచ్చాడు రజనీకాంత్. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడింది. కానీ, మళ్లీ ఇప్పుడు రజినీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నేళ్లుగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూనే ఉన్నాడు. అందుకే కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య కూడా భారీగానే తగ్గించేసాడు. ఓ సినిమా పూర్తైన తర్వాత మరో సినిమాను మొదలు పెడుతున్నాడు. ఆ మొదలు పెట్టిన సినిమాలను కూడా చాలా నెమ్మదిగా పూర్తి చేస్తున్నాడు.