తపోవనం ఆశ్రమ పీఠాధిపతి కన్నుమూత
వరంగల్ టైమ్స్, కాకినాడ జిల్లా: తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున ఆశ్రమంలో గుండెపోటుతో స్వామీజీ శివైక్యం పొందారు. గత15 రోజులుగా స్వామీజీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండురోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్ను మూశారని ఆశ్రమ నిర్వహకలు తెలిపారు. స్వామీజీ మృతితో భక్తుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సచ్చిదానంద స్వామీజీ శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ మహాస్వామి శిష్యరికం చేశారు. స్వామీజీ పార్థీవదేహానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నివాళులర్పించారు. స్వామీజీ భౌతికాయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.













