గుగూల్ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో​ గుగూల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్‌, గూగుల్‌ హోం, గూగుల్‌ డ్రైవ్‌తో పాటు యూట్యూబ్‌ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్‌ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్‌‌, ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. సేవల అంతరాయంపై గూగుల్‌ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల సర్వర్లు డౌన్‌ అయ్యాయని, కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది.