మెగా ట్విన్స్ పేర్లు ఇవే

మెగా ట్విన్స్ పేర్లు ఇవే

మెగా ట్విన్స్ పేర్లు ఇవేవరంగల్ టైమ్స్, హైదరాబాద్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిపిందే. ఈ పిల్లలకు శుక్రవారం నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మనవడు, మనవరాలి పేర్లను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆ పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగా కవలలకు శివ రామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అనే పేర్లను ఖరారు చేసినట్లు చిరంజీవి వెల్లడించారు. మనువడికి పెట్టిన శివ రామ్ అనే పేరు రెండు గొప్ప వ్యక్తిత్వాల కలయిక అని చిరంజీవి విరవించారు. తన అసలు పేరు శివ శంకర వర పరప్రసాద్ లొని శివ అరు పదం అంతర్గత శక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అయితే, రామ్ చరణ్ లోని రామ్ అనే పదం ధర్మానికి, కరుణకు ఛిహ్నమని పేర్కొంటారు. అలాగే మనవరాలికి పెట్టిన అన్వీర దేవి అనే పేరు దైవిక శక్తికి రూపమని, కనకదుర్గమ్మ తల్లి దీవెలనతో పెట్టిన ఈ పేరు భయం లేని తనాన్ని , అచందచయైనన ధైర్యాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. అపరిమితమైన ఆనందంతో ఈ పేర్ంలను ప్రకటిస్తున్నామని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ చిన్నాలకు అందరి దీవోనలు ఉండాలని ఓమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వౌరల్క గా మారింది.