నేడు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : ఎల్బీ స్టేడియంలోని సీఎం కేసీఆర్‌ సభ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌లోని పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కంట్రోల్‌ రూమ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు.. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుండి వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, చాపెల్‌ రోడ్‌ వైపు.. బషీర్‌బాగ్‌, అబిడ్స్‌ నుండి వచ్చే వాహనాలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, కోఠి వైపు.. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌ వైపు.. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌ మీదుగా మళ్లింపు చేపట్టారు.