టీఆర్ఎస్ పార్టీ ఆఫిస్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎర్రబెల్లి

జనగామ జిల్లా: జనగామ టౌన్ లో కొత్తగా నిర్మాణం చేస్తున్న టీఅర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతూ, మార్గ మధ్యంలో జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫిస్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎర్రబెల్లికేంద్రంలో నిర్మాణంలో వున్న టీఅర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. నిర్మాణ పనుల విషయమై తగు సూచనలు చేశారు. పనులు వేగంగా చేయాలని, సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.