నాటిన మొక్కలని సంరక్షిస్తాం: దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా: వరంగల్ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకై ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ పట్టణం పచ్చగా మారాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతి వనం హనుమాన్ టెంపుల్ వెనుక మొక్కలు నాటారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మొక్కల సంరక్షణ చర్యలను చేపట్టారు. మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలక బడ్జెట్లో 10 శాతం నిధులను హరిత పట్టణాలుగా నాటిన మొక్కలని సంరక్షిస్తాం: దాస్యంమార్చేందుకై వినియోగించాలని కేటీఆర్ సూచించారని ,వరంగల్ నగర బడ్జెట్ లో ఆరో విడుత హరితహారానికి రూ.20 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రణాళికలు సిద్ధం చేశామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.వర్షాకాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలను తరిమే మొక్కలు మస్కిటో రిపెల్లెంట్ మరియు సువాసనలు వెదజల్లే మొక్కలను నాటేందుకై కృషి చేస్తున్నామన్నారు. వరంగల్ నగరంలో స్మృతి వనం ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకై పచ్చదనం పరిశుభ్రత పై అధికారులు ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ ఆదివారం పది నిమిషాలపాటు పారిశుద్ధ్య కార్యక్రమం మరియు ప్రతీ శుక్రవారం గ్రీన్ ఫ్రైడే కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, హార్టికల్చర్ ఆఫీసర్ సునిత, మరియు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.