ఘనంగా నితిన్ షాలిని వెడ్డింగ్

హైదరాబాద్‌: టాలీవుడ్ న‌టుడు నితిన్ ఓ ఇంటివాడ‌య్యాడు. తాజ్ ఫ‌ల‌క్ నుమా హోట‌ల్ లో జ‌రిగిన వేడుక‌లో..ఇవాళ రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల‌కు నితిన్ కందుకూరి షాలిని మెడ‌లో మూడు మూళ్లు వేశాడు. క‌రోనా నేప‌థ్యంలో కేవ‌లం కొద్ది మంది స‌న్నిహిత‌లు స‌మ‌క్షంలో పెళ్లి వేడుక జ‌రిగింది. నితిన్‌-షాలిని పెళ్లి వేడుక‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. నితిన్‌-షాలిని కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వేడుక‌కు హాజ‌రై..నూత‌న వ‌ధూవ‌రుల‌కు త‌మ ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఘనంగా నితిన్ షాలిని వెడ్డింగ్

ఘనంగా నితిన్ షాలిని వెడ్డింగ్