‘అమ్మ ఒడి’కి సంబంధించి కీలక ప్రకటన

వెబ్​పోర్టల్​లో వివరాలు చూసుకోవాలి ‘అమ్మ ఒడి’కి సంబంధించి కీలక ప్రకటన‘అమ్మ ఒడి’కి సంబంధించి కీలక ప్రకటనఅమరావతి: జగనన్న అమ్మ ఒడికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. 2020-21 కు సంబంధించి విద్యార్థుల తల్లులు తమ వివరాలను వెబ్‌ పోర్టల్‌లో సరిచూసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. శుక్రవారం అమ్మ ఒడి పథకం అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు తమ బ్యాంకు అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్‌, రైస్‌ కార్డు నంబరు వంటి వివరాలను అమ్మ ఒడి వెబ్‌ పోర్టల్‌లో సరిచూసుకోవాలని కోరారు. ఒకవేళ బ్యాంకు వివరాలు, ఇతర అంశాల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్‌ను సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు. ఇంకా అభ్యంతరాలు ఉంటే అమ్మ ఒడి వెబ్‌ పోర్టల్‌లో సరిచేసుకోవాలన్నారు. వచ్చే నెలలో అమ్మ ఒడి రెండో విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.. అందుకే అధికారులు వివరాలను చెక్ చేసుకోమని సూచిస్తున్నారు.