హైదరాబాద్: సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’.ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేషన్‌తో డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని పీవీఆర్ థియేటర్‌లో విడుదల చేశారు. ‘తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. సినిమాలోని నాలుగు పాటలు విడుదలైతే అన్నింటికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది’అని హీరో సాయితేజ్ అన్నారు. ‘డిసెంబర్ 25న సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్’ తెలిపారు. ‘సాయితేజ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకు థాంక్స్ అని దర్శకుడు సుబ్బు అన్నారు. ‘సినిమాను మా జీ స్టూడియో అసోసియేషన్‌తో కలిసి విడుదల చేయడం ఆనందంగా ఉంది’అని జీ స్టూడియోస్ ప్రతినిధి నీరజ్ జోషి పేర్కొన్నారు. మనం ఎప్పుడు చూసినా తుది గెలుపు సినిమాదే అని రావు రమేశ్ అన్నారు. ఆరేడు నెలల అజ్ఞాతవాసం తర్వాత సినీ ఇండస్ట్రీ పాండవుల్లా యుద్ధానికి బయలుదేరింది. సాయికి పక్కాగా సూటయ్యే క్యారెక్టర్ ఇది అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్స్ కాసర్లశ్యామ్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.