ప్రేక్షకులను మెప్పించనున్న ‘బెల్‌ బాటమ్‌’

డిసెంబర్‌ 11న ఆహా వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌గా ప్రేక్షకులను మెప్పించనున్న స్పై క్రైమ్‌ కామెడీ ‘బెల్‌ బాటమ్‌’ప్రేక్షకులను మెప్పించనున్న 'బెల్‌ బాటమ్‌'

హైదరాబాద్​: ఈ దీపావళికి ఐదు బ్యాక్ టుబ్యాక్ సక్సెస్‌ఫుల్‌ రిలీజ్‌లతో ప్రేక్షకులకు పండుగ బోనంజా ఇచ్చిన 100% తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ శుక్రవారం మరో కొత్త చిత్రంతో వినోద పరంపరను కొనసాగిస్తోంది. కన్నడలో విడుదలై భారీ హిట్‌ సాధించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ ‘బెల్ బాటమ్’ను తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు వెర్షన్‌లో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న ప్రేక్షకుల సంఖ్యకు ‘బెల్‌బాటమ్‌’తో ‘ఆహా’ మాధ్యమం కొత్త శైలిని అందిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో ధ్రిల్లింగ్‌, కామెడీ అంశాలతో పాటు ఎమోషన్స్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్‌ దివాకరం రహస్యాలను ఛేదించడానికి చేసే పనులు మనకు నవ్వును తెప్పిస్తాయి. కచ్చితంగా కుటుంబంతో కలిసి నవ్వుకుంటూ ఈ వారాంతంలో ఎంజాయ్‌ చేసే చిత్రంగా ‘బెల్‌బాటమ్‌’ ప్రేక్షకులను అలరించనుంది. రెట్రో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన బెల్‌బాటమ్‌ తప్పక చూడాల్సిన చిత్రం. ఇందులోని విజువల్స్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, కాస్ట్యూమ్స్‌ హైలైట్‌గా నిలవనున్నాయి.

నటీనటులు:
రిషబ్‌ శెట్టి, హరి ప్రియ, అచ్యుత్‌ కుమార్‌, యోగరాజ్‌ భట్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కేఎం.ప్రకాశ్‌, మ్యూజిక్‌: అజనీశ్‌ లోక్‌నాథ్, ప్రొడక్షన్‌: గోల్డెన్‌ హార్స్‌ సినిమా, నిర్మాతలు: సంతోశ్‌ కుమార్‌ కేసీ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయతీర్థ.