రేపు గుడివాడకు పవన్​ రాక

రేపు గుడివాడకు పవన్​ రాకకృష్ణాజిల్లా: జనసేన అధినేత, సినీనటుడు పవన్​కల్యాణ్​ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు గ్రామానికి పవన్ రానున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం రానున్న పవన్ అక్కడ నుంచి నేరుగా గుడివాడకు చేరుకుంటారు. అనంతరం గుడ్లవల్లేరు మీదుగా డోకిపర్రు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. జన సేనాని పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. డోకిపర్రులో శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభయ్యాయి. ఇక ఈ దేవస్థానం మెగా సంస్థల యాజమాన్యానికి చెందినదన్న సంగతి విదితమే.