హాస్పిటళ్ల బంద్​ ప్రశాంతం

కృష్ణాజిల్లా, మచిలీపట్నం : కేంద్రప్రభుత్వం ఆయుర్వేద డాక్టర్లకు శస్త్ర చికిత్సలు చేసే వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ లు సంయుక్తంగా దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మచిలీపట్టణం శాఖలు సంయుక్తంగా శుక్రవారం ప్రైవేట్ హాస్పిటళ్ల బంద్ చేయించారు. అనంతరం ఐఎంఏ బిల్డింగ్ నుంచి వైద్యులు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ దవాఖానల్లో అత్యవసర కోవిడ్ సేవలు మినహా అన్ని సేవలు నిలిపి వేశారు.