ప్రజలకు భరోసా సచివాలయ వ్యవస్థ : చెవిరెడ్డి

ప్రజలకు భరోసా గ్రామ సచివాలయ వ్యవస్థ..ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి
నెరబైలు లో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనం ఆవిష్కరణప్రజలకు భరోసా సచివాలయ వ్యవస్థ : చెవిరెడ్డిఎర్రవారిపాలెం : పల్లె ప్రజలకు గ్రామ సచివాలయ వ్వవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్​, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎర్రవారిపాలెం నెరబైలులో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని చెవిరెడ్డి ఆవిష్కరించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యాలయాన్ని పరిశీలించి అత్యద్భుతంగా నిర్మాణం చేశారని అధికారులను ప్రశంసించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా గ్రామ సచివాలయం రూపుదిద్దుకుందని తెలిపారు. ప్రజలు వేచి ఉండేందుకు వీలుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు ప్రజల వద్దకే పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని వెల్లడించారు. గ్రామ సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాలను వారి చెంతకు చేర్చాలని సూచించారు. అధికారులు ప్రజా సంక్షేమం కోసం పాటు పడాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. స్పందించిన చెవిరెడ్డి వినతులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎర్రవారిపాలెం లో నూతనంగా నిర్మితమైన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయానికి చేరుకొని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మురళి మోహన్ రెడ్డి, తహసీల్దార్​ ఉమా మహేశ్వరి, ఇతర అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.