పీవీకి భారతరత్న ప్రకటించాలి: అమెరికా తెలుగు సంఘాలు

పీవీకి భారతరత్న ప్రకటించాలి: అమెరికా తెలుగు సంఘాలుహైదరాబాద్​: బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత పూర్వప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని అమెరికాలోని పలు తెలుగు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు పీవీ మైత్రి ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రపంచంలో ఒక బలమైన ఆర్థికశక్తిగా నిలబడటానికి ఆనాడు పీవీ ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాలు, సంస్కరణలే అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పీవీ ఘనతను గుర్తించాలని, పీవీ సేవల్ని ప్రజలకు తెలియజేసి భారతరత్న పురస్కారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పీవీ మైత్రి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అనేక ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. ప్రకటన విడుదల చేసిన వారిలో అమెరికాలో నివసించే పీవీ తనయురాలు కల్వకోట సరస్వతీరావుతో పాటు వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు… ప్రసాద్ స్వర్ణ, శ్రీనివాస్ గుల్లపల్లి, అశోక్ కుమార్, ప్రవీణ్ చింత, శ్రీధర్ తాళ్లూరి, అశ్విన్ పటేల్ జీ, కాజా విశ్వేశ్వరరావు, అశోక్ బడ్డి, హరి దేవబత్తిని, మురళీ మేడిచర్ల, ప్రకాశ్ కపిల, శరత్ చంద్ర, ప్రవీణ్ పురం, సుధ కొండపు, కవిత చల్లా, హరి అట్లూరి ఉన్నారు.