నేటి నుంచి మెట్రో ప్రయాణ సమయం పొడిగింపు

హైదరాబాద్‌ : నేటి ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మెట్రోరైల్‌ సమయాన్ని పొడగించనున్నట్లు మెట్రోరైల్​ ఎండీ బుధవారం తెలిపారు. రేపటి నుంచి భరత్​నగర్​, గాంధీ దవాఖాన, ముషీరాబాద్​ మెట్రోస్టేషన్లు తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.