క‌మిట్‌మెంట్ టీజ‌ర్ లాంచ్‌!

హైదరాబాద్‌: తేజ‌స్వి మ‌డివాడ, అన్వేషి జైన్, ర‌మ్య ప‌సుపిలేటి‌, సూర్య శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం క‌మిట్ మెంట్‌. ల‌వ్, డ్రీమ్,హోప్‌, ఫైట్ అనే నాలుగు భిన్న‌మైన స్టోరీల‌తో ఈ చిత్రం సాగుతుంది. క‌మిట్‌మెంట్ టీజ‌ర్ లాంచ్‌!హైద‌రాబాద్ న‌వాబ్స్ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌చ‌న మీడియా వ‌ర్క్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఎఫ్3 ప్రొడ‌క్ష‌న్, ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ. టి నిర్మిస్తున్నారు. ఈ రోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల కార్య‌క్ర‌మంలో క‌మిట్ మెంట్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. న‌లుగురు మ‌హిళ‌ల జీవితంలోకి పురుషులు ఎంట‌రైన త‌ర్వాత  వారి జీవితాల‌పై క‌మిట్ మెంట్ ప్ర‌భావం ఎలా ప‌డిందనేది సినిమాలో చూపించ‌నున్న‌ట్టు టీజ‌ర్ ను చూస్తే అర్త‌మ‌వుతుంది. రొమాంటిక్ గా సాగుతూనే మ‌రోవైపు ఆడ‌పిల్ల‌లు క‌న‌బ‌డితే క‌మిట్‌మెంట్లు, కాంప్ర‌మైజ్‌లు త‌ప్ప ఇంకేమి ఆలోచించ‌రా అంటూ తేజ‌స్వి చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రానికి
రచన. ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మీకాంత్ చెన్నా,
నిర్మాత‌: బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ. టి,
సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్, న‌రేష్ రానా,
సంగీతం: నరేష్ కుమారన్,
ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: సుప్రియ బ‌ట్టెపటి,
డైలాగ్స్‌: స‌ంతోష్ హ‌ర్ష‌, కార్తిక్ అర్జున్‌, క‌ల్లి క‌ళ్యాణ్‌,
లిరిక్స్‌: పూర్ణాచారి, గాంధి,
పిఆర్ఒ: వ‌ంశీ – శేఖ‌ర్‌.