వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్..! 

వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్..!

వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్..! 

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగులను తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ , అమెజాన్, మెటా, ట్విట్టర్, ఇంటెల్, గూగుల్, ఓఎల్ఎక్స్ తదితర టాంప్ కంపెనీలు ఇప్పటికే చాలా మందిని ఇంటికి పంపించేశాయి. ఈ జాబితాలోకి తాజాగా టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది.

కంపెనీలో వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టినట్లు ఈ సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో ఈ తగ్గింపులు 5 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించారు.