ఉప్పల్ లో తండ్రీ కొడుకులు దారుణ హత్య

ఉప్పల్ లో తండ్రీ కొడుకులు దారుణ హత్య

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : ఉప్పల్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ వెనుకే ఉన్న హనుమసాయి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.తండ్రి నరసింహమూర్తి (78), కుమారుడు శ్రీనివాస్‌ (35)లను దుండగులు చంపేశారు. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురావడంతో ఇద్దరినీ అత్యంత పాశవికంగా హతమార్చారు.ఉప్పల్ లో తండ్రీ కొడుకులు దారుణ హత్యతనను సైతం కత్తితో బెదిరించినట్లు పనిమనిషి చెబుతోంది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో బ్లూ టీషర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్‌ రోడ్డు వైపు పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న ఉప్పల్‌ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే బృందాలుగా విడిపోయి సమీపంలోని పలు కాలనీలు, ప్రదేశాల్లో గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం బంధువులే హత్య చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు.