సోనూసూద్‌ కు తనికెళ్ల, కొరటాల సన్మానం

సోనూసూద్‌ కు తనికెళ్ల, కొరటాల సన్మానంహైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్‌ సమర్పణలో మాట్నీ మూవీస్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చిరంజీవి షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ క్రమంలో తాజాగా నటుడు సోనూసూద్‌ ఆచార్య సినిమా షూటింగ్‌ సెట్స్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌లో సోనూసూద్‌ అందించిన మానవత సేవలను ప్రశంసిస్తూ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర యూనిట్‌తో కలిసి ఆచార్య సెట్‌లో సత్కరించారు. శాలువ కప్పి, మెమొంటో అందజేశారు.