శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి శుక్ర‌‌వారం మ‌ధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించింది.శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.