వ‌రుస‌గా రెండో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

న్యూఢిల్లీ: వ‌రుస‌గా రెండో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. శ‌నివారం పెట్రోల్‌ లీట‌ర్‌కు 15 పైస‌లు, డీజిల్ లీట‌ర్‌కు 20 పైస‌లు పెరిగింది. పెరిగిన ధ‌ర‌తో హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర లీట‌ర్‌కు రూ.84.62కు చేర‌గా, డీజిల్ ధర రూ.72.32కు చేరుకుంది. శుక్ర‌వారం కూడా పెట్రోల్‌పై 17 పైస‌లు, డీజిల్‌పై 22 పైస‌లు పెంచిన సంగ‌తి తెలిసిందే.