టీఆర్​ఎస్​కు పట్టం కట్టిన ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు

టీఆర్​ఎస్​కు పట్టం కట్టిన ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు

హైద‌రాబాద్: గ‌్రేట‌ర్ పీఠాన్ని పట్నం వాసులు గులాబీ పార్టీకే క‌ట్ట‌బెట్టిన‌ట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. మ‌ల‌క్‌పేట్ డివిజ‌న్‌లో రీ పోలింగ్ ముగిసిన అనంత‌రం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి అయ్యాయి. ఇక ఎన్నికల ప్రచారం విషయానికొస్తే ఓటర్లను తమ పార్టీ వైపునకు తిప్పుకోవడానికి అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేశాయి. టీఆర్​ఎస్ పథకాలు మరియు ఆ పార్టీ అధికారంలో ఉండడం ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడంలో టీఆర్​ఎస్​ శ్రేణులు విజయం సాధించారు. ఇక ఎంఐఎం పార్టీ విషయానికొస్తే టీఆర్​ఎస్​తో దోస్తీ బీజేపీతో వ్యతిరేకత ఉండడం హైదరాబాద్​లో వారికి కొంతమేర లాభం జరిగింది. బీజేపీ పార్టీ విషయానికొస్తే ఆపార్టీ నాయకులు మరియు కేంద్ర మంత్రులు గ్రేటర్​లో ముమ్మర ప్రచారం చేసి ఓటర్లకు వారు చేసిన వాగ్దానాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపించలేదని ఈ ఎగ్జిట్​ పోల్​ ఫలితాల ద్వారా తెలుస్తోంది. మరోపక్క కాంగ్రెస్​ పార్టీ గురించి మాట్లాడుకుంటే కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్​ సరైన నాయకుడు లేకపోవడం వాళ్లు గత కొన్ని ఏళ్లుగా అధికారంలో లేకపోవడం ఆపార్టీ ప్రచారం ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. ఇక కమ్యూనిస్టు పార్టీలు మరియు ఇండిపెండెంట్​ అభ్యర్థుల విషయానికొస్తే వీళ్ల ఫాలోవర్స్​ ఓట్లు తప్ప మిగితా ఓటర్ల వీరిపై ఆసక్తి కనబరచలేదు. వివిధ పార్టీల ప్లస్​లు మైనస్​లు టీఆర్​ఎస్​ పార్టీకి గ్రేటర్​లో బలాన్ని చేకూర్చింది. ఇక ఫలితాల పరంగా చూసుకుంటే తెరాస మొదటిస్థానం ఎంఐఎం రెండో స్థానం బీజేపీ మూడో స్థానం, కాంగ్రెస్​ నాలుగో స్థానం ఇతరులు ఐదో స్ధానాన్ని సాధించారు. ఇక మొత్తానికి చూసుకుంటే తెరాస ప్రభుత్వం మరోసారి గ్రేటర్​ ఎన్నికల్లో పీఠాన్ని దక్కించుకోవడం ఖాయం. గ్రేటర్​ ఎన్నికలపై వివిధ సంస్ధలు చేసిన ఎగ్జిట్ ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.​

టీఆర్​ఎస్​కు పట్టం కట్టిన ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు టీఆర్​ఎస్​కు పట్టం కట్టిన ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు