గ్రేటర్​ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం

గ్రేటర్​ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం

హైదరాబాద్​: గ్రేటర్​ ఎన్నికల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 150 డివిజన్లకు ఓట్ల లెక్కింపు కోసం 30 ప్రాంతాల్లో కౌంటింగ్​ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి సర్కిల్​ పరిధిలో వార్డులను బట్టి 150 హాళ్లలో​ ఒక్కో హాల్​కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్​కు ఒక కౌంటింగ్​ సూపర్​వైజర్​, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. ముందుగా పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను లెక్కించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్​కు ఒక ఏజెంట్​ను నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకుడి తుది నిర్ణయం తర్వాతే ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అన్ని కౌంటింగ్​హాళ్లలో సీసీటీవీ వీడియోగ్రఫీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లెక్కింపునకు పూర్తి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్​లో పాసులు లేనివారికి అనుమతి లేదన్నారు.