రైతు సమస్యల పరిష్కారానికి కృషి :అంబటి కృష్ణారెడ్డి

రైతు సమస్యల పరిష్కారానికి కృషి..రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డిరైతు సమస్యల పరిష్కారానికి కృషి :అంబటి కృష్ణారెడ్డిఅమ‌రావ‌తి: రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో గురువారం వేద పండితుల మంత్రోచ్ఛారణాల నడుమ కార్యాలయ ప్రవేశం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైతు అవసరాలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు సీఎం దృషికి తీసుకెళతానన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా పంటలన్నీ నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పటికే 4 జిల్లాల్లో స్వయంగా పరిశీలించి, పంట నష్టాలను నమోదు చేశామన్నారు. త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించి, పంట నష్టాలను నమోదు చేసి, సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. కార్యాలయ ప్రవేశ సందర్భంగా వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, శివనాథ్‌రెడ్డి తదితరులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అనుచరులు పాల్గొని అంబటి కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు.