సంరక్షణ కార్యదర్శులకు నియామక పత్రాల అందజేత

సంరక్షణ కార్యదర్శులకు నియామక పత్రాల అందజేతకృష్ణాజిల్లా: జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శుల అభ్యర్థుల ఖాళీలు, పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన మొత్తం 83 మందికి గురువారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ తో కలిసి నియామక పత్రాలు అందజేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారన్నారు. కృష్ణ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1286 పోస్టులకుగాను, ఇప్పటికే 1186 సిబ్బందిని ఎంపిక చేసి వివిధ ప్రాంతాల్లో వారికి పోస్టింగ్​లు కేటాయించారు. మిగిలిన 100 పోస్టులకు 83 మందికి నియామక పత్రాలను అందజేశారు. గ్రామ స్వరాజ్య వ్యవస్థ బలపడితే అట్టడుగు ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు ఎస్పీ. ఈ ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి నిర్వర్తించాలని మరొకసారి అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేంద్ర కుమార్, ఆరైలు శ్రీనివాస రావు, వెంకట్ రావు, ఏవో మూర్తి, ఎస్సైలు పోలీస్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.