ముగిసిన గ్రేటర్ పోలింగ్​

ముగిసిన గ్రేటర్ పోలింగ్​హైదరాబాద్​: హైదరాబాద్​ గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. జీహెచ్​ఎంసీలో మొత్తం 149 డివిజన్లలో పోలింగ్​ జరిగింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పట్టణంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనే పోలింగ్​ ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆర్​సీపురం , పటాన్​చెరు, అంబర్​పేట సర్కిళ్లలో భారీ పోలింగ్​ నమోదైంది. మలక్​పేట ,కార్వాన్​ పరిధిలో అతి తక్కువగా పోలింగ్​ జరిగినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు జరిగిన పోలింగ్​ మొత్తం 45.97 పోలింగ్​ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది.గతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది.  అయితే 400 ఏళ్ల చరిత్ర గల భాగ్యనగరానికి ఇంత తక్కువగా ఓటింగ్ నమోదు కావడం ఇది సిగ్గు చేటని విశ్లేషకులు అంటున్నారు. బల్ధియా పోలింగ్​ పై వరుస సెలవులు ప్రభావం చూపాయని పలువురు చర్చించుకుంటున్నారు. గ్రేటర్​ ఎన్నికల పరిధిలోని ఓల్డ్​ మలక్​పేటలో రీ పోలింగ్​ నిర్వహించనున్నట్లు , రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్​ పార్థసారధి చెప్పారు. డివిజన్​లోని పోలింగ్​ నమూనా బ్యాలెట్​లో పత్రంలో సీపీఐ కంకికొడవలి గుర్తుకు బదులు సీపీఎం గుర్తు సుత్తె కొడవలి గుర్తును ప్రింట్​ చేశారు. అయితే ఇది గమనించిన సీపీఐ పార్టీ నాయకులు ఎలక్షన్​ కమిషన్​కు ఫిర్యదు చేశారు. దీంతో స్పందించిన ఎలక్షన్​ కమిషన్​ మలక్ పేట్ డివిజన్ బ్యాలెట్ వ్యవహారంలో ప్రింటింగ్ ప్రెస్ లో సింబల్ ప్రింట్ తప్పు పడిందని వివరించారు. ఇక్కడ ఈ నెల మూడో తేదీన రీపోలింగ్​ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.