వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట పాకాల అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లుగా అటవీశాఖాధికారులు నిర్థారణ చేయడంతో ఖానాపూర్ పోలీసులు అప్రమత్తమైనారు. నర్సంపేట ఎ.సి.పి ఫణీందర్ ఆదేశాల మేరుకు పాకాల ప్రాంతంలో నివాసం వుండే స్థానికులతో పాటు పాకాలను సందర్శించే పర్యాటకులను అప్రమత్తం చేస్తూ ఖానాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ సాయిబాబా అధ్వర్యంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పాకాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు, అప్రమత్తంగా వుండాలని ప్రచారం కొనసాగిస్తున్నారు.